English | Telugu

లాస్ట్ బ్రదర్ ఆఫ్ చైనా కు 50 వేల పీపీఈ కిట్స్

*హెల్త్ ఎమెర్జెన్సీ లోనూ డ్రాగన్ కుట్ర రాజకీయాలు
*మరో సారి భారత్ లో విద్వేష జ్వాలలు రేపేందుకు పన్నాగం

చైనా చేసే ప్రతి పని వెనుక ఒక రీజన్, ఒక లాజిక్ ఉంటాయి. కేవలం 32 కేసులున్న అసోంకు 50 వేల పీపీఈ కిట్స్ పంపించటం ద్వారా చైనా, మరో సారి కొత్త కుట్ర కు తెర తీసింది. ఈ కిట్స్ ను చైనా నుంచి పొందిన తొలి రాష్ట్రంగా అసోం నిలవటానికి కారణం, చైనాకు అసోం కి మధ్య ఉన్న బంధుత్వం. ఈ రోజుకీ అసోం లో చాలా మంది , తమను తాము లాస్ట్ బ్రదర్స్ ఆఫ్ చైనా గా అభివర్ణించుకుంటుంటారు. అందుకనే చైనాకు, అసోం మీద ప్రత్యేకమైన అభిమానం. త్వరలోనే అసోంలోని డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు ఈ కిట్లను పంపిణీ చేస్తారని తెలిసింది.

దేశమంతటికీ కరోనా భయం పట్టుకున్న వేళ, చైనా నుంచి మొట్టమొదటిగా, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్స్ ను దిగుమతి చేసుకున్న రాష్ట్రంగా అసోం నిలిచింది. చైనాలోని గాంగ్జౌ నుంచి టేకాఫ్ అయి, బుధవారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన బ్లూ డార్ట్ విమానం, 50 వేల పీపీఈ కిట్స్ ను తీసుకుని వచ్చింది. ఎన్నో ప్రపంచ దేశాలు పీపీఈ కిట్స్ కోసం చైనా వైపు చూస్తున్న వేళ, చైనా అసోంకు వీటిని పెద్ద ఎత్తున పంపించడం గమనార్హం.

ప్రస్తుతం అసోంలో కేవలం 32 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రాల సగటుతో పోల్చినా, కేసుల సంఖ్య పరంగా చూసినా, ఇది చాలా తక్కువే. ఇక విమానాశ్రయంలో పీపీఈ కిట్స్ ను రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమాంత బిశ్వ శర్మ స్వీకరించారు. "భారత ప్రభుత్వంతో పాటు చాలా దేశాలు చైనా నుంచి పీపీఈ కిట్స్ ను దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా కూడా పీపీఈల కోసం చైనా వైపే చూస్తోంది. వీటిని చైనా నుంచి డైరెక్ట్ గా దిగుమతి చేసుకున్న తొలి రాష్ట్రంగా అసోం నిలిచింది" అని ఆయన అన్నారు.

మొత్తం 2 లక్షల కిట్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని తాము భావిస్తున్నామన్నారు. వాస్తవానికి పీపీఈ కిట్స్ ను డైరెక్ట్ గా చైనా నుంచి దిగుమతి చేసుకోవడం ఓ రాష్ట్రానికి అంత సులువేమీ కాదు. ఎన్నో పెద్ద రాష్ట్రాలు, మరిన్ని వనరులుండి కూడా కిట్స్ ను ఇంపోర్ట్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నాయి.