English | Telugu

కరోనా బాధితుల్లో అత్యధికులు పొగతాగేవారే! డబ్ల్యూహెచ్‌వో

శ్వాసకోశ,, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారిపైనా కరోనా దాడి చేస్తోంద‌నిడబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. పొగతాగేవారిపై కరోనా అధికంగా ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌వో తేల్చిచెప్పింది.పొగ పీల్చినప్పుడు ఏస్‌–2 ఎంజైమ్‌ను ముక్కు అధికంగా స్రవిస్తుందని, వైరస్‌ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుకునేందుకు ఇది బాటలు వేస్తోందని స్పష్టం చేసింది. చైనా, ఇటలీలలో అత్యధిక శాతం కరోనా రోగులు పొగతాగేవారేనని పేర్కొంది.

ప్రపంచంలో కోవిడ్‌–19 వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో శ్వాసకోశ వైద్య నిపుణుడు జానీస్‌లీంగ్‌ అధ్యయనం చేశారు. పొగతాగే వారే అత్యధిక శాతం కరోనా బారిన పడినట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది.చైనాలో కరోన బారిన పడిన 82,052 మందిలో 95 % మంది పొగతాగే అలవాటున్న వారేనని అధ్యయనంలో తేలింది.
ఇటలీ లోనూ సింహభాగం కరోనా రోగులకు పొగతాగే అలవాటున్నట్టు గుర్తించారు.

కరోనా బారిన పడిన వారిలో పొగతాగేవారి తర్వాతి స్థానం తీవ్ర శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారిదేనని వెల్లడైంది.పొగ తాగడం మానేసేందుకు ఇంతకంటే మంచి సమయం రాదని జానీస్ లీంగ్‌ చెప్పారు.