English | Telugu
'దగ్గుబాటీ'స్ కర్రీ పాయింట్!
Updated : Apr 13, 2020
*నాటుకోడి పులుసు, బిర్యానీ రెడీ...
లాక్‌డౌన్ దెబ్బతో గల్లీలో కూలీ పనిచేసే కార్మికుడి దగ్గరి నుంచి దేశ అత్యున్నత స్థాయి వ్యక్తుల వరకు అంతా ఇంటికే పరిమితం అయ్యారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావడం లేదు. దాదాపు అన్ని రంగాల్లోని వారి పరిస్థితి ఇంతే. నిత్యం బిజీగా ఉండే క్రికెటర్లు, సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. ఎవరి పనులు వారే చేసుకుంటున్నారు. ఇంట్లో కూరగాయలు కట్ చేయడం దగ్గరి నుంచి బాత్ రూమ్స్ క్లీన్ చేసే వరకు అంతా వాళ్లే చేసుకుంటున్నారు. ఇంటి పనులు చేస్తూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ రాజకీయ నాయకుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, వంట పనుల్లో భార్యకు సాయం చేస్తోన్న వీడియోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.
కిచెన్‌లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎలా చెఫ్‌గా మారి.. వంట పనుల్లో తన భార్యకు సాయమందిస్తూ బిజీగా వున్నారు. సండే స్పెషల్‌గా నాటుకోడి పులుసు, బిర్యానీ రెడీ చేసారు...