English | Telugu
జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వం దివాళా తీసిందా?
Updated : May 26, 2020
లాక్‌డౌన్ సమయంలో ఇంత అర్జెంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వ భూములను రక్షించుకోవాలి కానీ అమ్ముకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఆదాయం కోసం ఇతర మార్గాలు అన్వేషించాలి కానీ, ప్రభుత్వ భూములు అమ్ముకోవడం సబబు కాదని హితవు పలికింది. అయితే, కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ తరపు న్యాయవాది గడువు కోరారు. తీర్పుకు అనుగుణంగానే భూముల వేలం ఉండాలని స్పష్టం చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.