English | Telugu
'వాట్సాప్ పాఠాలు'... ఏపీ ప్రభుత్వం నిర్ణయం!
Updated : May 12, 2020
‘ఆన్‌లైన్’ ద్వారా తరగతులను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. మొత్తం పాతిక వేల మంది వరకు విద్యార్ధులు, మరో 933 మంది ఉపాధ్యాయులు ఈ వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు తమ క్లాసులను వీడియో రికార్డ్ చేసి ‘ యూ ట్యూబ్’లో అప్‌లోడ్ చేస్తారు.
సంబంధిత ‘యూఆర్‌ఎల్ లింక్’లను వాట్సాప్ గ్రూప్ లేదా ‘ఈ-మెయిల్’ ద్వారా విద్యార్ధులకు పంపుతారు. ఆ వీడియోల ద్వారా విద్యార్ధులు తరగతులను ఫాలో కావాల్సి ఉంటుంది.
అలాగే విద్యార్ధులు తాము తయారు చేసుకునే నోట్స్‌ను కూడా వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఉపాధ్యాయులకు పంపాల్సి ఉంటుంది. మొత్తంమీద ఈ విధానంతో కరోనాను కట్టడి చేయడంతోపాటు విద్యార్ధులకు సమయం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంటర్మీడియెట్ విద్యార్ధులకు కూడా ఇదే విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.