English | Telugu
నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్
Updated : Jun 1, 2020
హైకోర్టు తీర్పుపై అభ్యంతరాలను పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం లేవనెత్తినట్లు సమాచారం. ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వానికి ఉన్న హక్కల మేరకే కమిషనర్‌గా కనగరాజును నియమించామని ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై రేపు లేదా ఎల్లుండి విచారణ జరిగే అవకాశం ఉంది.
కాగా, ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను కొనసాగించాలంటూ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌లు, జీవోలను కూడా కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు మెట్లెక్కింది.