English | Telugu
పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Updated : May 15, 2020
నెలకు రూ. 2 లక్షల వేతనంతో 2018 ఏప్రిల్ 14న అప్పటి ప్రభుత్వం సాహుని కన్సల్టెంట్‌గా నియమించింది. అప్పటి నుండి హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా సాహు పనిచేస్తున్నారు. అయితే.. ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు. దీంతో, కన్సల్టెంట్‌గా సాహును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. ఆయన స్థానంలో ఎవరినైనా నియమిస్తారా? లేదా ఆ పోస్టును పూర్తిగా తొలగిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.