English | Telugu

ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి మార్చ్ 6 వ తేదీన జరిగిన సమావేశం లో, ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. స్ధానిక ఎన్నికలతో పదోతరగతి పరీక్షల వాయిదా ఏపీలో ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసుకుంటున్నట్లు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని మార్చ్ 6 న రాజకీయ పార్టీలతో సమావేశం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ నెల 21, 24 తేదీల్లోనూ, మున్సిపల్ ఎన్నికలను ఈ నెల 27న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లోగడ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అదే సమయంలో ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. అసలే ఎన్నికల సీజన్ కావడంతో పదో తరగతి పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు ప్రిపరేషన్ లో ఇబ్బందులు ఎలాగో తప్పవు. కనీసం పరీక్షలు అయినా వాయిదా వేస్తే ఊరట లభిస్తుందని తల్లితండ్రులు భావించారు. అయితే, తదనంతర పరిణామాల్లో, కరోనా వైరస్ కారణంగా మొత్తం ఎన్నికల షెడ్యూల్ నే ఆరు వారలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ప్రకటించటం, దరిమిలా, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ పూర్వక వాతావరణం నెలొకొనడం అందరికీ తెలిసిన విషయమే. అయితే, కరోనా తీవ్రత దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పదో తరగతి పరీక్షల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో పిల్లలు, వారి తల్లితండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.