కారణం ఏదైతేనేం సీఎం జగన్ మాకు రాజధానిగా అమరావతి కాదు అని డిసైడ్ ఐన తరువాత విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఎవరెంత మొత్తుకున్నా బ్యాక్ గ్రౌండ్ లో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అని వార్తలు వస్తుంన్నాయి. దీనికి మరింత బలం చేకూర్చే తాజా వార్త ఏంటంటే సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మరి కొంత మంది అధికారులు, ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ అండ్ టీమ్ తో కలిసి విశాఖలోని పలు ప్రదేశాలు సందర్శించారు. రాజధాని కోసం అనువైన భవనాలు, ప్రదేశాలను ఎంపిక చేసే ప్రక్రియ లో భాగంగా ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ తన 12 మంది సభ్యుల బృందతో కలిసి ఈ పర్యటనలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఒక వైవు కరోనా మరో వైపు కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అవి తేలేలోపుగా భవనాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యం లో ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోంది.