English | Telugu

ఎన్నికల వ్యయ పరిశీలకులుగా అటవీ శాఖాధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల వ్యయ పరిశీలకులుగా అటవీశాఖ అధికారులను నియమించడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల పరిశీలకులు గా 13 జిల్లాలకు అటవీశాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించడం జరిగింది. వారితో పాటుగా మరో నలుగురు అధికారులను రిజర్వు లో ఉంచారు.

జిల్లాల వారిగా పి.రామ కృష్ణ - కృష్ణా జిల్లా, బిఎన్ఎన్ మూర్తి - గుంటూరు జిల్లా, ఎం. శివ ప్రసాద్ - కర్నూలు జిల్లా , శ్రీమతి ఆర్. యశోదా బాయి - శ్రీకాకుళం జిల్లా, అలాన్ చోంగ్ టెరోన్ - వై ఎస్సార్ కడపజిల్లా , సి.సెల్వం తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ శేఖర్ బాబు గెడ్డం ప్రకాశం జిల్లా, కుమారి నందిని సలేరియా - విశాఖపట్నం జిల్లా, జగన్నాథ్ సింగ్ -చిత్తూరు జిల్లా, అనంత్ శంకర్ - పశ్చిమగోదావరి జిల్లా, నరేంథరన్ జిజి - అనంతపురం జిల్లా, సందీప్ కృపాకర్ గుండాలా - విజయనగరం జిల్లా, , సునీల్ కుమార్ - నెల్లూరు జిల్లా లకు నియమించామన్నారు. వీరికి అదనంగా నలుగురు సీనియర్ అధికారులు- టి. జ్యోతి, షేక్ సలాం, వై.శ్రీనివాస రెడ్డి, శ్రీకాంతనాథారెడ్డిలను రిజర్వు లో ఉంచినట్టు చెప్పారు.