English | Telugu
కరోనా వైరస్ దెబ్బకి దిగొచ్చిన చైనా కాలుష్యం
Updated : Mar 10, 2020
ఎంకిపెళ్లి సుబ్బి చావుకి వచ్చిందనేది పాత సామెత. ఇప్పుడు దాన్ని కొంచెం మాడిఫై చేస్తే ....ఒకో సారి ఎంకి చావు సుబ్బి పెళ్ళికి వచ్చిందని కూడా చదువుకోవచ్చు. ఆర్ధిక మాంద్యం కారణం గా చైనా లో నైట్రోజెన్ డయాక్సయిడ్ లెవెల్స్ పడిపోయినట్టు నాసా, యూరోపియన్ స్పెస్ ఏజెన్సీ సంయుక్తంగా విడుదల చేసిన సాటిలైట్ ఇమేజెస్ ఇదే విషయాన్ని విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారకమైన నైట్రోజెన్ డయాక్సయిడ్ గణనీయంగా తగ్గటానికి చైనా ఎదుర్కుంటున్న ఆర్ధిక మాంద్యమే కారణమనేది నాసా వారి సూత్రీకరణ అన్న మాట. ఇంకాస్త వెనక్కు వెడితే, కరోనా వైరస్ వ్యాధి ఉధృతి కారణంగా 23 జనవరి తర్వాత చైనా లో పరిశ్రమలు, స్థానిక వ్యాపారాలు, రవాణా వ్యవస్థ పూర్తిగా కుదేలయ్యాయి. ఫలితంగా చైనా దేశం లో కాలుష్య శాతం గణనీయంగా తగ్గినట్టు శాస్త్ర వేత్తలు నిర్ధారించారు.
ఏ ఏడాది జనవరి 28 న తీసిన సాటిలైట్ చిత్రాలతో, నిరుడు జనవరి 28 న తీసిన చిత్రాలను పోలిస్తే, కాలుష్యం 30 శాతానికి పడిపోయినట్టు శాస్త్ర వేత్తలు నిర్థారించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యల కారణంగా చైనా లో కాలుష్య శాతం గణనీయంగాపడిపోయిందని ఎయిర్ క్వాలిటీ సైన్ టిస్ట్ బ్యారీ లోఫర్ వివరించారు.
నిజానికి 2008 ఎకనామిక్ ఆర్ధిక మాంద్యం ముందు కూడా చైనా లో నైట్రోజెన్ డయాక్సయిడ్ లెవెల్స్ క్రమేపీ తగ్గటాన్ని ప్రస్తావిస్తున్న శాస్త్రవేత్తలు, 2020 కరోనా వైరస్ ప్రభావం వల్ల చైనా పాటించిన జాగ్రత్తల కారణం గా కాలుష్యం తగ్గుతూ వచ్చిందనేది శాస్త్రవేత్తల విశ్లేషణ.
1952 డిసెంబరు మొదట్లో ఒక చల్లని పొగమంచు లండన్ పై పరుచుకున్న విషయాన్ని ప్రస్తావించిన శాస్త్రవేత్తలు, .చలి తట్టు కోవటానికి లండన్ వాసులు మామూల కంటే ఎక్కువగా బొగ్గును కాల్చడం మొదలు పెట్టడం తో ఎదురైన దుష్పరిణామాలను వివరించారు .దీని వలన తయారైన వాయు కాలుష్యం, ఫాగ్ లోని చల్ల గాలుల సాంద్రత వల్ల బంధింపబడిన పొగమంచు వల్ల, కైవారం 4 రోజుల్లో 4,000 మంది మృత్యువాత పడ్డారు. అయితే, ఈ విషయం పై విస్తారం గా పరిశోధన చేసిన చైనా శాస్త్ర వేత్తలు, తమ దేశం లో అటు వైరస్ ను నిరోధిస్తూ, ఇటు కాలుష్య కారక నైట్రోజెన్ డయాక్సయిడ్ శాతాన్ని కూడా పర్యావరణం లో తగ్గించగలిగారు.