English | Telugu
పదవతరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ లోనే బోధన!
Updated : Apr 14, 2020
ఏపీలో టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ గడువు మే 3 వరకు పొడగించడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. పరీక్షలు జరిగేంత వరకు వారికి సీఎం ఆదేశాలు మేరకు ఆన్ లైన్ సప్తగిరి ఛానల్ ద్వారా క్లాస్ తీసుకుంటారు. ఉదయం 10-11, సాయంత్రం 4-5 ఇవి ప్రసారం అవుతాయి. అవే క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్ లో కూడా అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు.
విద్యామృతం పేరుతో కార్యక్రమం రూపొందించాం అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి అధ్యాపకుల ఎంపిక చేస్తున్నాం. ఇప్పటికే ట్రయిల్ రన్ చేసామని మంత్రి తెలిపారు.
విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఈ క్లాసులను వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఛానల్ లో వచ్చే ఈ క్లాసులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు విద్యార్థుల హాజరుకు సంబంధించి గ్రామ సచివాలయ సిబ్బంది విద్యా శాఖకు సమాచారం అందిస్తారు. ఉపాధ్యాయులు కూడా హాజరును పరిశీలించనున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.