English | Telugu

కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాల ఆధారంగా చర్యలు!

ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడంపై సమాయత్తం కావాలని అధికారులను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కోవిడ్‌ నివారణా చర్యలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షకు సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సంబంధిత లక్షణాలతో ఎవరు వచ్చినా... కోవిడ్‌ పేషెంట్‌గానే భావించి ఆమేరకు వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని, దీనిపై ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలను పాటించేలా చూడాలని కూడా సీఎం ఆదేశించారు. ఢిల్లీలో జమాత్‌కు వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు వీలైనంత వేగంగా పూర్తిచేయాలని, ప్రతి జిల్లాలో కూడా ఒక టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యాన్నికూడా పెంచాలని, ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరాయంగా సర్వే జరుగుతుండాలని ముఖ్యమంత్రి మరో సరి మరోసారి స్పష్టం చేశారు.