English | Telugu

ఆంధ్ర లో మరణాల శాతం 2.83 మాత్రమే : ముఖ్యమంత్రి 

రాష్ట్రంలో చనిపోయిన వారి శాతం 2.83 మాత్రమేనని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మీడియా సమావేశంలో ఈ రోజు మాట్లాడిన ఆయన, కరోనా సోకితే జీవితం నాశనం అవుతుందనే భావన వద్దని, గ్రీన్ జోన్ లో కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయని భరోసా ఇచ్చారు. ప్రజలు భౌతిక దూరం పాటించడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలిరాష్ట్రంలో అందరికి మాస్క్ లు అందజేస్తున్నాం. స్వయం సహాయక గ్రూప్ సభ్యులు మాస్క్ లు తయారు చేస్తున్నారు. బయటకు వచ్చే ప్రజలు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలి. ప్రతి రోజు పండ్లు,కూరగాయలు తీసుకోవాలి అని సి ఎం సూచించారు.

రవాణా వాహనాలు ఇప్పుడు తిరిగే అవకాశం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ లో రక్షణ చర్యలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన వారిపట్ల వివక్ష చూపొద్దు, మనం వివక్ష చూపిస్తే తరువాత ఆ ప్రభావం మనపై పడుతుందని గ్రహించాలి, వృద్దులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవాలి, అవసరమైన వారికి ఇంటి వద్దకే మందులు అందజేస్తామన్నారు. రంజాన్ నెల ప్రారంభమైంది. ప్రార్ధనలు ఇళ్లలోనే చేసుకుంటున్న విషయం మంచిదే. రాష్ట్రానికి మంచి జరగాలని ముస్లింలు, క్రిస్టియన్స్,హిందువులు ప్రార్థనలు చేయాలని కోరుకుంటున్నాను. కరోనా నియంత్రణ కు గ్రామ వాలంటీర్లు, ఆశ వర్కర్స్,ఎ ఎన్ ఎమ్ లు,వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి కి రాష్ట్ర ప్రజలు తరపున ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.