English | Telugu
జితేందర్ శర్మ మళ్ళీ ఏసేశాడు!
Updated : Apr 8, 2020
* ఏ ఎం టీ జెడ్ సి. ఈ. ఓ. కు సహకరిస్తున్న విజయవాడ మాజీ ఎం. పి . ఎవరు ?
* బాబు థియరీ -సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవడమంటే ఇలాగేనని నిరూపించిన శర్మ
* ఏ ఎం టీ జెడ్ అవినీతి పాపాలపై టీ డీ పీ లో 'పిన్ డ్రాప్ సైలెన్స్ '
* ఇప్పుడు ఆ రెండు పార్టీలకూ జితేందర్ శర్మ అత్యంత సన్నిహితుడు
ఏది ఏమైనా ఆయన మాయల మరాఠీ అని మరో సారి రుజువైంది. లేకపోతె, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో ఏ ఎం టీ జెడ్ కు జితేందర్ శర్మ, సి ఈ ఓ గా రాజ్యం చేసిన సమయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపైన వై ఎస్ ఆర్ సి పి సమరశంఖం పూరించడం ఏమిటీ, దరిమిలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించడం ఏమిటీ , ఇదంతా జరిగిన కొద్ది కాలానికే ఆయనకు మళ్ళీ సి ఈ ఓ పదవి కట్టపెట్టడం ఏమిటీ. ఇవన్నీ చూస్తుంటే ఆయన కన్ఫార్మ్డ్ గా మాయల మరాఠీ అని నిరూపణ అయినట్టే కదా. ఆయన నేర్పరి తనం, ఢిల్లీ లో ఆయనకున్న లాబీయింగ్,నితిన్ గడ్కరీ ఆశీస్సులు, పూనమ్ మాలకొండయ్య సాంకేతిక సహకారం, ఇంకా విజయవాడ మాజీ ఎం. పి . లౌక్యం వెరసి- జితేందర్ శర్మ ను మళ్ళీ ఏ ఎం టీ జెడ్ పీఠంపై అధిష్టింప చేసిన తీరుకు కొనసాగింపు ఏమిటంటే, ఆయన ఈ రోజు మళ్ళీ తన మాయా దండాన్ని ఒక్క సారిగా ఝుళిపించి, ఏ ఎం టీ జెడ్ లో మే నెల మొదటి వారానికల్లా రోజుకు 25వేల కిట్లు తయారుచేసే సామర్థ్యాన్ని చేరుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని సమ్మోహితుడుని చేసేశారు. ఆ కథా క్రమాన్ని కళ్లారా చూసి, చదివి తరించిన వారికి ఫలశృతి ఏమిటంటే, ఆయన గారి మాయాజాలంలోకి మీరు కూడా ఉచితంగా ఎంట్రీ పాంసుడవచ్చునన్న మాట. ఇన్ఫ్రా వ్యవస్థ లేమీ లేకుండా, ఏ ఎం టీ జెడ్ లో రోజుకి పాతిక వేల కిట్ల తయారీ, దాంతో పాటు పాత అవినీతి కథలో భాగస్వామ్యులైన టీ డీ పీ కార్పొరేట్ గ్రూపులు, జితేందర్ శర్మ కు ఉన్న లింకులను పక్క పక్కన పెట్టి చూస్తుంటే, బహుశా అటు చంద్రబాబు నాయుడును, ఇటు జగన్ మోహన్ రెడ్డి ని కూడా బుట్టలో వేసుకున్న జితేందర్ శర్మ జాణ తనమేమిటో బయటపడుతుందని విజిల్ బ్లోయర్స్ అంటున్నారు. ఇంతకీ, ఆయన అవినీతి మీద అప్పటి అవినీతి నిరోధక శాఖ డి.జి.పి. ఆర్ పీ ఠాకూర్ జరిపిన దర్యాప్తు ఏమైనట్టు? విజిలెన్స్ చేసిన దర్యాప్తు కి ఏమి గతి పట్టినట్టు? ఇప్పుడు ఇవన్నీ శేష ప్రశ్నలే. దాని, కొనసాగింపుగా ఈ రోజు జితేందర్ శర్మ , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని సమ్మోహన పరిచిన తీరు ఒక్కసారి మీరే చదవండి.... చంద్రబాబు నాయుడు ఫార్ములా -అదేనండీ...సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవడమంటే ఎలాగో జితేందర్ శర్మ స్కూల్ లో చేరి తెలుసుకోవచ్చు. ఇహ, ఈ రోజు విశేషాలు చదవండి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తయారైన కోవిడ్ –19 ర్యాపిడ్ టెస్టు కిట్లను సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
విశాఖపట్నంలోని మెడ్ టెక్ జోన్‌లో కోవిడ్–19 ర్యాపిడ్ టెస్ట్‌కిట్ల తయారీని నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా పరిశీలించిన సీఎం.
టెస్ట్‌కిట్ల తయారీని, పనిచేసే విధానాలను వివరించిన మెడ్ టెక్ జోన్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ, సిబ్బంది.
దేశంలో మూడు కంపెనీలకు మాత్రమే కిట్ల తయారీకి సంబంధించి అనుమతులున్నాయని జితేంద్ర శర్మ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. మెడ్‌టెక్ జోన్‌లో మోల్‌బయో సంస్థ కిట్ల తయారీని ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 2వేల కిట్లను తయారీ చేస్తామని, ఏప్రిల్ రెండోవారానికల్ల రోజుకు 10వేల కిట్లు, మే నెల మొదటి వారానికల్లా రోజుకు 25వేల కిట్లు తయారుచేసే సామర్థ్యాన్ని చేరుకుంటామని జితేందర్ శర్మ వెల్లడించారు. త్రీడీ ప్రింటింగ్ లేబొరొటరీలో వీటిని తయారుచేస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపిన సిబ్బంది. అలాగే కరోనా వైరస్ సోకడం వల్ల క్రిటికల్ సమస్యలు ఎదుర్కొన్నవారికి వైద్యం అందించడంలో అత్యంత కీలకమైన వెంటిలేటర్ల తయారీకూడా ప్రారంభించామని సీఈఓ చెప్పారు. ఏప్రిల్‌లో 3వేల వెంటిలేటర్లను తయారుచేస్తున్నామని చెప్పారు. మే నుంచి ప్రతి నెలా 6వేల వెంటలేటర్లను తయారుచేస్తామని ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రచారం, ఆర్భాటం లేకుండా అత్యంత కీలక సమయంలో పనులు ముందుకు సాగడం మంచి పరిణామమన్న సీఎం.
ర్యాండమ్ కిట్లు అందుబాటులోకి వచ్చినందున పరీక్షలు చేసే సామర్థ్యం పెరుగుతుందన్న సీఎం.
రోజుకు 10వేల పర్సనల్ ఎక్విప్‌మెంట్‌కిట్ల చొప్పున మూడురోజుల్లో మరో 30వేల పీపీఈలు అందుబాటులోకి రానున్నాయని సీఎంకు వెల్లడించిన అధికారులు.
ఇవికూడా రాష్ట్రంలోనే తయారవుతున్నాయన్న అధికారులు.