English | Telugu
ఏప్రిల్ 14 న లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదు: ప్రధాని
Updated : Apr 8, 2020
‘‘ప్రతిరోజూ అన్ని రాష్ట్రాల సీఎంలతో, నిపుణులతో చర్చిస్తూనే ఉన్నా. ఏ ఒక్కరూ కూడా లాక్‌డౌన్ ఎత్తివేయాలని అభిప్రాయపడలేదు. మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతా. ఒకే సారి లాక్‌డౌన్ ఎత్తేయడం సాధ్యం కాకపోవచ్చు. మున్ముందు మరిన్ని ఊహించని నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని ఫ్లోర్ లీడర్లతో మోడీ అన్నట్లు సమాచారం.
ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సానుకూలంగా ఉంటేనే.. కరోనా మహమ్మారిపై విజయం సాధించగలమని మోడీ అన్నారు. ఈ కష్ట సమయంలో రాజకీయ పార్టీలన్నీ ఐకమత్యంగా వ్యవహరించడం అభినందనీయమన్నారు. అలాగే, వైరస్ కట్టడికి విశేష కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.