English | Telugu
ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులు మూసివేత
Updated : Mar 22, 2020
|
రేషన్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఒక కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఏప్రిల్ 4వ తేదీన ₹1,000 విలువైన నిత్యావసర సరుకులు అందచేస్తామన్నారు. నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులు పెడతామని సి ఎం హెచ్చరించారు. రోజువారీ కార్మికులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవున్నారు. తప్పని సరి పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి వస్తోందని చెప్పిన సి ఎం, ఏపీలో ప్రస్తుతం కరోన అదుపులో ఉంది.14రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. వృద్ధులను,పిల్లలను బయటకు రాకుండా చూడాలని సి ఎం సూచించారు. |