English | Telugu

ఏపీ బీజేపీ తొలి విజయం ఇదే .. సోము వీర్రాజు 

నిన్న సమావేశమైన ఏపీ కేబినెట్ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ నిర్వహించేవారికి, అలాగే ఆడేవారికి కూడా జైలు శిక్ష ప‌డుతుందని కూడా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా దీనిపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ కృషి వల్లే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అయన చెప్పుకొచ్చారు.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల సామాన్య ప్రజల ఆలోచనలలో వచ్చే చెడు మార్పుల గురించి, అలాగే దీని ద్వారా ప్రజల సొమ్ము దోపిడీ అవడం పైనా మొన్న మేలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ గారిని కలిసినపుడు అయన దృష్టికి తీసుకు వచ్చినట్లుగా అయన తెలిపారు. ఇవే కాకుండా ఇప్పటికే ప్రభుత్వం గుట్కాని నిషేధించినప్పటికీ, ఇప్పటికీ కిరాణా షాపుల్లోను, కిళ్లీ షాపుల్లో, అలాగే బ్లాక్ మార్కెట్ లోను గుట్కా దొరుకుతుండడం పై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తాను సూచించినట్లు సోము వీర్రాజు తెలిపారు. ఈ రోజు ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ ని ఏపీ ప్రభుత్వం బ్యాన్ చేయడం ఏపీ బీజేపీ సాధించిన తొలి విజయం. అలాగే గుట్కా అమ్మకాలు కూడా అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సీఎం జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అని సోము వీర్రాజు తాజాగా ట్వీట్ చేశారు.