English | Telugu

కరోనా కు మరో కొత్త వ్యాక్సిన్

అమెరికా లోని ఓహైయో యూనివర్సిటీ పరిశోధన

ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం

కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోన్నే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు ఏ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్ కోసం ప్రపంచమానవాళి ఆశగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో కరోనా మహమ్మారితో పోరాడుతూ వైరస్ ను సమర్ధవంతంగా అడ్డుకునే వ్యాక్సిన్ ను అమెరికాలోని ఓహైయోవర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటికే వారు కనిపెట్టిన వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించగా ఆశించిన ఫలితాలు వచ్చాయని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త యు జో డాంగ్ వివరించారు.

కోవిద్ 19 వైరస్ రెండు రకాల ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని శరీరంలోని జీవకణాలను సోకుతాయి. అయితే ఈ వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకునే కొన్నిరకాల ప్రోటీన్ల ఉత్పత్తికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. ఓహైయో యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేసిన వ్యాక్సిన్ ను ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటిలో ఎక్కువసంఖ్యలో వైరస్ ను ఎదుర్కోనే ప్రొటీన్లు విడుదలైన విషయం గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ద్వారా ‘సెల్యూలార్ ప్రాసెస్’ చేయడం వల్ల ఎలుకల్లోని జన్యు సమాచారాన్ని ఫంక్షనల్ ప్రొటీన్లుగా మార్చే ఆర్ఎన్ఏ మెసెంజర్ అణువుల సీక్వెన్స్ (అన్‌ట్రాన్స్‌లేటెడ్ రీజియన్స్-యూటీఆర్)లో మార్పులు చోటుచేసుకోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన ఎలుకల్లో వైరస్ ను ఎదుర్కోనే ప్రోటీన్లు విడుదల కావడంతో పాటు యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అయినట్లు పరిశోధకులు వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిద్ వైరస్ కు వ్యాక్సిన్ తయారీ జరుగుతున్నా ఆ వ్యాక్సిన్ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో పరిశోధకులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.