English | Telugu
రాణా కపూర్‌కు, ప్రియాంక గాంధీకి మధ్య సంబంధం ఏమిటి?
Updated : Mar 11, 2020
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ప్రియాంక గాంధీ నుంచి పెయింటింగ్ ఎందుకు కొన్నారు? ఇప్పుడు ఈ వ్యవహారానికి రాజకీయ రంగు కూడా పులుముకుంది.
దేశంలో ప్రతి ఆర్థిక నేరానికీ గాంధీల కుటుంబంతోనే లోతైన సంబంధాలు ఉంటున్నాయి. సోనియా గాంధీకి విజయ్ మాల్యా అప్‌గ్రేడెడ్ విమాన టికెట్లు పంపేవారు. మన్మోహన్ సింగ్, చిదంబరంతో ఆయనకు సంబంధాలు ఉండేవి. నీరవ్ మోదీ నగల కలెక్షన్‌ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఆయన బ్యాంకును మోసం చేశారు. ప్రియాంక వాద్రా నుంచి రాణా కపూర్ పెయింటింగ్స్ కొన్నట్లు ఇప్పుడు వెల్లడైంది'' అని అమిత్ మాలవీయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి.
ప్రియాంక గాంధీపై వచ్చిన ఆరోపణల గురించి కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ సింఘ్వీ ఘాటుగా స్పందించారు. ఎమ్ఎఫ్ హుస్సేన్ రాజీవ్ గాంధీ చిత్రాన్ని వేశారు. దాన్ని గాంధీ కుటుంబం రాణా కపూర్‌కు రూ.2 కోట్లకు విక్రయించింది. ఇదంతా 2010లో జరిగిన వ్యవహారం'' అని వివరించారు.
రాణా కపూర్ చెక్ రూపంలో ప్రియాంక గాంధీకి ఆ చెల్లింపు చేశారని, ఆ వివరాలను ప్రియాంక ఐటీ రిటర్న్స్‌లోనూ చూపించారని అభిషేక్ చెప్పారు. ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఒకటి ఇటీవల రూ.13.44 కోట్లకు అమ్ముడుపోయిందన్న విషయాన్ని అభిషేక్ గుర్తుచేశారు.
బీజేపీ అసలు విషయం మీద నుంచి దృష్టి మరల్చేందుకే తాజా ఆరోపణలు చేసిందని అన్నారు.
''మోదీ నిర్వహించిన ప్రముఖ అంతర్జాతీయ సదస్సుకు 2020 మార్చి దాకా రాణా కపూర్ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈడీ కస్టడీలో తీసుకున్నారు. రాణా కపూర్ కుటుంబ సభ్యుల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రాణా కపూర్ కూతురు రోష్నీ కపూర్‌ను లండన్ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లోనే ఆమెను ఆపేశారు.