English | Telugu

నెల్లూరులో కలకలం.. ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టింది. నెల్లూరులో తొలి కరోనా వైరస్‌ పాజిటివ్ కేసు నమోదైంది. రెండువారాల క్రితం ఇటలీ నుంచి వచ్చిన ఓ యువకుడిని పరీక్షించిన వైద్యులు.. అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ యువకుడు కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. అతడి నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్యులు పుణె పంపగా కరోనా సోకిందని తేలింది. దీంతో ఆ యువకుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.