English | Telugu
గోదావరి పుష్కరాల్లో ఎంతమందికి మరణానికి మీరు కారణమయ్యారు?
Updated : Apr 25, 2020
నెలరోజుల లాక్ డౌన్ కాలంలో ఒక్క మంచి సలహా చంద్రబాబు ఇచ్చిన పాపాన పోలేదని, బురదచల్లే కార్యక్రమాన్ని కూడా హైద్రాబాద్ లో ఉండి చేస్తున్నారనీ, అపుడప్పుడు స్కైప్ లో వస్తారనీ వై ఎస్ ఆర్ సి పీ ఎం ఎల్ ఏ అంబటి రాంబాబు విమర్శించారు. సుధీర్ఘమైన ఉపన్యాసాలు చెబుతారు.మొన్న టిడిపి ఎన్ ఆర్ ఐ మీటింగ్ లో చూశాను.వారంతా భజన చేస్తూ.... ఇప్పుడు మీరు ఉండి ఉంటే అద్భుతంగా,చాలా గొప్పగా ఉండేదంటూ మాట్లాడుతున్నారు. ఏం అద్భుతంగా ఉండేదండి...సొల్లు చెప్పే కార్యక్రమం...గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చి మీడియా స్పేస్ నంతా ఆక్రమించుకోవాలనే తాపత్రయం తప్ప మరోటి కనిపించడం లేదంటూ అంబటి రాంబాబు సెటైర్ విసిరారు. గోదావరి పుష్కరాలలో ఎంతమంది మరణానికి మీరు కారణమయ్యారు.అయితే మీకు,మాకు తేడా ఉంది.జగన్ గారికి గంటలతరబడి ఉపన్యాసాలు చెప్పేటందుకు ప్రావీణ్యత లేదు.పనిచేయడంలో మాత్రమే ఆయనకు ప్రావీణ్యత ఉంది.
ఈరోజు రాష్ట్రంలో ఐఏఎస్,ఐపిఎస్ అధికారులందరితోను కలసికట్టుగా టీమ్ వర్క్ చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. అందరితో రివ్యూలు చేస్తూ,చర్చిస్తున్నారు.ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా దానిని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నారు.
మీరు వేరే రాష్ట్రంలో ఉన్నారు.ఆ రాష్ర్టానికి,ఏపికి హెరిటేజ్ ఫుడ్స్ నుంచి చెరి 30 లక్షల రూపాయలు చందా ఇచ్చారు.మీరు పర్సనల్ గా పదిలక్షలు ఇచ్చారు.రెండు రాష్ట్రాలు నాకు సమానమే అన్నారు.మంచిదే డబ్బులు ఇవ్వడంలో మీకు సమానం.కాని సలహాలు ఇవ్వడంలో సమానం ఎందుకు లేదండి.....అని అడుగుతున్నాను. ఆ రాష్ట్రంలో వారికి సలహాలు ఇవ్వరు.అక్కడ ఏమీ డిమాండ్ చేయరు.ఇస్తే కేసిఆర్ గారు దరువు వేస్తారనే భయం.ప్రధానమంత్రి నరేంద్రమోది,అమిత్ షా కాళ్లు పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారు.వాళ్లు మీకు కాళ్లు దొరకనివ్వరు, అంటూ రాంబాబు విమర్శించారు.
అక్కడొక(తెలంగాణ) రకంగా వ్యవహరిస్తారు.ఇక్కడొక రకంగా వ్యవహరిస్తారు.ఇక్కడ రాళ్లు వేయడం ధర్మం కాదని చెబుతున్నాను.
అదేమంటే చంద్రబాబు అంటున్నారు.ఏపి ప్రభుత్వం వాస్తవాలు దాస్తోంది.కరోనా రోగులు ఎంతమంది ఉన్నారో చెప్పడం లేదంట.వాస్తవాలు దాయాల్సిన అవసరం ఎందుకుంటుంది.ఎందుకు ఆ విధంగా బురదచల్లే కార్యక్రమం చేస్తారు.విమర్శలు చేస్తారు.
మీతోపాటు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇదే విధంగా అన్నారు.హైకమాండ్ మొట్టికాయలు మొట్టినట్లు ఉంది.ఆయన సర్దుకున్నాడు.చంద్రబాబుతో ప్రయాణం చేయకండి దూరంగా ఉండండి.బాబుగారితో కలసి భజన చేయకండని బిజేపి జాతీయ అధ్యక్షుడు చెబితే ఆయన సర్దుకున్నారు. వాస్తవాలు చెప్పకుండా దాయడం అనేది ఈ ప్రభుత్వానికే కాదు ఏ ప్రభుత్వానికి కూడా ఉండటానికే వీల్లేదు.ఉన్న వాస్తవాలు స్పష్టంగా చెబుతున్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు.ఇది దుర్మార్గమైన ఆలోచన.ఈ సమయాన్ని మీరు ఎంచుకుని జగన్ గారి ప్రభుత్వంపై రాళ్లు వేసే ప్రయత్నం చేయడం ధర్మం కాదు. మీరు హైద్రాబాద్ లో ఉన్నారు.ఈ రాష్ట్రంలో మీకు ఇల్లుందన్నారు కదా.....పరిపాలన చేశారు.ఎందుకు ఈ రాష్ట్రానికి రారు.ఇక్కడ ఉండకండా అక్కడ దాక్కోవాల్సిన ఖర్మ ఏం పట్టింది.ఇది నైతికతేనా, అంటూ రాంబాబు ప్రశ్నించారు.
నేను ఉన్నాను ఈరోజున....గుంటూరులో ఉంటున్నాను...సత్తెనపల్లిలో నన్ను ఎన్నుకున్నారు.రెండురోజులకైనా సత్తెనపల్లి వెళ్లి అధికారులతో మాట్లాడకపోతే నాకు నిద్రపట్టదు.ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఎలా సహాయం చేయాలనే తాపత్రయం.ఆ తాపత్రయం మీ దగ్గర ఏది. పోనీ మీకు లేదు....మీకు 70 ఏళ్లు వచ్చాయి. మా లాగానే వృధ్ధులు ...కరోనా సోకితే ప్రమాదం.మీరు రావడం లేదు సరే మంచిదే.మీ అబ్బాయి,యువకుడు, ఆరోగ్యవంతుడు...మీ వారసుడు...మంగళగిరిలో పోటీచేసి దురదృష్టంకొద్ది ఓడిపోయాడు.ఆయన ఎందుకు ఈ రాష్ట్రానికి రాడు.ఆయన ఎందుకు సలహాలు ఇవ్వడు? మీకు సంబంధించిన ఎంఎల్ఏ ఒక్కరైనా సహాయకార్యక్రమాలలో పాల్గొన్నారా....సహాయం చేయాలనే ప్రయత్నం చేశారా.ఇళ్లకే పరిమితం అయి ఇళ్లల్లో కూర్చున్నారు.అదేమంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు,మంత్రులు లాక్ డౌన్ లో బయటకువస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారూ అంటూ విమర్శలు చేస్తున్నారు.
అలా చేస్తూ కరోనా వ్యాప్తి చెందేలా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. అందరికి మనవి చేస్తున్నాను.రాబోయే కాలం కరోనాతోనే మనం జీవించాలి.సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మన కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలి.ఈరోజు మా ఎంఎల్ ఏలు నియోజకవర్గాలలోని పేదవారిని ఎలా ఆదుకోవాలి....రెక్కాడితే గాని డొక్కాడని వారికి నాలుగువేళ్లు లోపలికి వెళ్లేలా ఏం చేయాలి....మనం సహాయం చేయాలా...ఎన్ జి ఓల ద్వారా సహాయం చేయించాలా అనే తాపత్రయంతో ఎంఎల్ ఏలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ముందుకు వెళ్తుంటే వారిపై కూడా బురదచల్లుతున్నారు. గుంటూరులో ఎక్కువ కేసులు ఉంటే గుంటూరు ఎంఎల్ ఏ గారిది బాధ్యతా...నరసరావుపేటలో ఎక్కువ కేసులు ఉంటే నరసరావుపేట ఎంఎల్ ఏ గారిది బాధ్యతా...మా సత్తెనపల్లిలో ఒకే ఒక్క కేసు ఉంది.నేను గొప్పవాడినా కాదు....
కొన్ని ప్రత్యేక పరిస్ధితుల వలన....విదేశాలనుంచి వచ్చిన వారి వల్లనో.నిజాముద్ధీన్ కు వెళ్లి వచ్చినవారి వల్లనో కొన్ని ప్రాంతాలలో కరోనా వ్యాప్తి జరుగుతోంది.దానిని అరికట్టే విధంగా వ్యవహరించాలి తప్ప సందు దొరికింది కదా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలపై బురదచల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఎంఎల్ ఏ నియోజకవర్గ ప్రజలపై ప్రేమాభిమానాలతో ఉండాల్సిన సమయం ఇది.వారికి సహాయం అందిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్దితి ఉంటుంది. ఈరోజు అనేక సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి.కూరగాయలు,మాస్కులు,శానిటైజర్లు ఇస్తున్నారు.ఈ మధ్య చంద్రబాబు అంటున్నారు....సేవాకార్యక్రమాలు చేయాలంటే వారు స్వయంగా చేయకూడదంట...తహసిల్దార్ కు చెప్పాలంట అని మాట్లాడుతున్నారు.నిజమే కరోనా వ్యాప్తి కాకుండా ఉండేందుకు సిస్టమాటిక్ గా చేయాలని ప్రభుత్వం వ్యవహరిస్తుంటే దానిని సైతం విమర్సించే విధంగా చంద్రబాబు ఆయన తాబేదార్లు పనిచేస్తున్నారు.ఇది సరైన విధానం కాదు.
మీరు హైద్రాబాద్ లో కూర్చోండి...సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండండి...ఆ బంగ్లాలోనే ఉండండి....కాని ఈ విధంగా ప్రభుత్వాన్ని,వైద్యులను,ఐపిఎస్,ఐఏఎస్ అధికారులను డిమోరలైజ్ చేయాలనే విధంగా మీరు చూడటం సరైనవిధానం కాదు.
చంద్రబాబుగారు మీరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకండి...బాధ్యతతో వ్యవహరించండి.సద్విమర్శలు చేయండి.మంచి సలహాలు స్వీకరించేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుధ్దితో ఉందంటూ రాంబాబు చెప్పారు.