English | Telugu
బాబు క్షమాపణలు చెప్పాలని అమరావతి రైతుల డిమాండ్
Updated : Nov 25, 2019
రాజధానిలో చంద్రబాబు పర్యటనకు ముందే వివాదం రాజుకుంది. చంద్రబాబు రాజధానిలో అడుగుపెట్టే ముందు రైతులకు క్షమాపణ చెప్పాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చామని.. బెదిరించి మరీ భూములు లాక్కున్నారని ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు పలువురు రాజధాని రైతులు. రాజధాని ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వివరణ ఇచ్చిన తర్వాతే బాబు రాజధానిలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న బాబు రాజధానిలో పర్యటించనున్నారు.
రాజధాని ప్రకటించిన రోజు కూడా మందడం హై స్కూల్ లో రైతు అభిప్రాయ సేకరణ అని ఓ మీటింగ్ నిర్వహించటం జరిగింది. ప్రతి గ్రామానికి రెండు రోజులు ఆటో తిప్పి రైతులందరి దగ్గర సమాచారం చెప్పమని.. అందరూ ఏకాభిప్రాయంతో భూములు ఇద్దామని పేర్కొన్నారు. భూములు ఇచ్చాక ఎటువంటి కార్యక్రమం జరగలేదు.. రైతులు చర్చలు జరిపి భూములు ఇవ్వాలని అనుకున్నా అప్పటి స్థానిక ఎమ్మెల్యే అడ్డుకున్నారని తెలిపారు. అదే సమయంలో తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ మీటింగ్ ని రసాభాస చేయడం వల్ల రైతులు రెండు వర్గాలుగా అయిపోయారని చెప్పారు. తమ మీద లేనిపోని కేసులు పెట్టి బలవంతంగా మమ్మలని ఇబ్బందులు పెట్టి రకరకాలగా భూములు కేసులని, మా ఇళ్ల ముందు పోలీసులను పెట్టి చాలా రకాలుగా మమ్మల్ని బాధపెట్టారని రైతులు గతాన్ని గుర్తు చేశారు.