English | Telugu

ఏబీవీ సస్పెన్షన్ ఆగస్టు వరకూ పొడిగింపు

ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్ట్ 5 వరకూ ఏబీ పై ఉన్న సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సివిల్ సర్వీస్ అధికారుల సస్పెన్షన్ రివ్యూ కమిటీ నివేదిక ఆధారంగా ఏ బీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.