English | Telugu
శంషాబాద్ లో దారుణం.. యువతి దారుణ హత్య
Updated : Nov 28, 2019
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వెటర్నరీ డాక్టర్ గా పని చేస్తున్న ప్రియాంక రెడ్డిని దారుణంగా హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం, చటాన్ పల్లి గ్రామ శివారులో పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు. దహనమవుతున్న మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు.ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారు అనే అంశం కలకలం రేపుతుంది. ఈ సంఘటనకు సంభందించి ప్రస్తుతానికి పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటన పై విచారణ కొనసాగుతుంది. విచారణలో అసలు ప్రియాంకా రెడ్డిని ఎవరు చంపారు..ఎందుకు చంపారు..దేనికోసం చంపారు.. అనే విషయాన్ని కనుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేపడుతున్నారు.
ప్రయాంకా రెడ్డి ఓ వెటనరీ డాక్టర్ గా పని చేస్తొందని తెలిసింది. ప్రియాంకా తన విధులు నిర్వహించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. మెయిన్ రోడ్ హైవే మీద అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారు. రాత్రి సమయంలో తాను షంషాబాద్ లోని ఇంటికి వస్తున్న సమయంలో తన స్కూటీ టైరు పంక్చర్ అవ్వడంతో రోడ్డు పై నిలబడి తన సోదరికి కాల్ చేసి మాట్లాడింది. దాదాపు అరగంట సేపు మాట్లాడిన తరువాత సిగ్నల్ కట్ అవ్వడంతో ఇంట్లో వాళ్లు కంగారు పడ్డారు.ఇవాళ ఉదయం చటాన్ పల్లి దగ్గర స్థానికులు మృతదేహం కాలుతుండడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.స్కూటీ అధారంగా మృతదేహం ప్రియాంకా రెడ్డిగా గుర్తించారు పోలీసులు.