English | Telugu
గాలిపటంతో పాటు గాలిలోకి చిన్నారి
Updated : Aug 31, 2020
ప్రతి ఏటా జపాన్ లోని సముద్రతీర పట్టణమైన నాన్లియోవోలో పతంగుల పండుగ జరుగుంది. వివిధ ఆకారాల్లో, సైజుల్లో ఇక్కడ గాలిపటాలను ఎగురువేస్తారు. చిన్నాపెద్దా అంతా సంతోషంగా గాలిపటాలు ఎగురువేస్తున్న సమయంలో మూడేళ్ల చిన్నారి గాలిపటంతో సహా గాలిలోకి ఎగిరింది. అమాంతం గాలిలోకి కొన్ని మీటర్ల ఎత్తువరకు ఎగిరిన ఆ చిన్నారి గాలిపటంతో సహా కొద్ది క్షణల పాటు గాలిలోనే చెక్కర్లు కొట్టింది. అంతా నివ్వెరపోయి చూస్తుండగానే గాలిపటాన్ని గట్టిగా పట్టుకుని ఆ చిన్నారి వేసిన కేకలతో అందరూ అప్రమత్తం అయ్యారు. నారింజ రంగు గాలిపటం చివరన వేలాడుతూ గాలిలో మెలికలు తిరిగిన ఆ దృశ్యాన్ని వీడియోలో రికార్డు అయ్యింది. అక్కడ ఉన్నవారికి అందనంత ఎత్తుకు ఎగిరిన గాలి పటం గాలివాటానికి తిరిగి నేలపైకి రావడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
గాలి పటం తోక చిన్నారికి చుట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ పాపాయికి ఎలాంటి గాయలు తగలలేదని, అయితే చాలా భయపడిందని నిర్వాకులు వెల్లడించారు. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గాలిపటాలు ఎరుగవేసే సమయంలో వాటికి దూరంగా ఉండాలని ఈ సంఘటన తర్వాత కైట్ ఫెస్టివల్ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేశారు.