English | Telugu
అందంతో బడాబాబులను ట్రాప్ చేస్తున్న హనీ దంపతులు...
Updated : Oct 31, 2019
అందాన్ని పెట్టుబడిగా పేడుతూ మన చుట్టూ రోజు ఎన్నొ మోసాలు జరుగుతుంటాయి. అలాంటి ఒక మోసమే ఈ మధ్య తెగ హల్ చల్ చేస్తోంది. కరిష్కా అనే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేసే అమ్మాయి అందాన్ని పెట్టుబడిగా పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కన్నది. అందుకు భర్త విజయ్ కుమార్ కూడా సై అన్నాడు. ఇంకేముంది అసలే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం, ఇక బడాబాబులకు గాలం వేసే పనిలో పడింది. అయితే ఆమె వలలో నగరానికి చెందిన ఒక వ్యాపార వేత్త పడ్డాడు.హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. రిసార్టులు, హోటళ్లు, పబ్బులు ఇద్దరూ తెగ ఎంజాయ్ చేశారు. దాదాపు మూడు నెలల పాటు ఇద్దరూ సరదాగా గడిపారు.
కనిష్క వ్యాపారవేత్తతో చనువుగా ఉన్న సమయంలో ఆమె భర్త విజయ్ కుమార్ ఫొటోలు తీయటం, వీడియోలు రికార్డు చేయటం వంటివి చేశాడు. ఓ రోజు ఇద్దరు శంషాబాద్ సమీపంలోని ఒక రిసార్టుకు వెళ్లారు. అయితే తనను ట్రాప్ చేసిన సంగతి తెలీని సదరు వ్యాపారికి ఆమె మత్తుమందు ఇచ్చింది. ఇక సీన్ లోకి ఎంటరైన భర్త విజయ్ కుమార్ అక్కడ సినిమా సన్నివేశాన్ని క్రియేట్ చేశాడు. ఫర్నిచర్ ధ్వంసం చేశాడు కరిష్కను రక్తం వచ్చేలా కొట్టి స్వల్పంగా గాయపరిచాడు. స్ప్రుహలోకొచ్చిన వ్యాపారితో విజయ్ కుమార్ గొడవపడ్డాడు. తన భార్యతో గడిపి సరసం ఆడతావా అంటూ బెదిరించాడు. ఓ దశలో పిస్టల్ తో కూడా బెదిరించాడు.దీంతో భయపడిపోయిన సదరు వ్యాపారి స్పాట్ కు ఇరవై లక్షలు తెప్పించి వారికి ఇచ్చాడు. దాంతో పాటు మరో కోటి రూపాయలకు బాండ్ పేపర్ కూడా రాయించుకోవటంతో తనకేమీ కాదని సైలెంట్ అయ్యాడు.
అయితే విజయకుమార్ నుండి మరిన్ని డబ్బులు కావాలంటూ బెదిరింపులు రావడంతో బాధితుడు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హనీ దంపతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ కిలాడీ లేడీ బారిన పడి ఒక ఎన్నారై కూడా బాధపడినట్టుగా తెలుస్తోంది. మరికొందరు వ్యాపారవేత్తలూ బలైనట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. బాధితులు ఇక పై ఇలాంటి పరిస్థితులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వాపోయారు.