English | Telugu
మళ్ళీ విచారణకు సిద్దమైన విశాఖ భూ కుంభకోణం కేసు...
Updated : Oct 18, 2019
ఒకప్పుడు విశాఖ భూ కుంభకోణం కేసు హాట్ టాపిక్ గా హడావిడి చేసింది అన్న విషయం అందరికి తెలిసిందే.విశాఖ భూ కుంభకోణంపై మళ్లీ విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. విశాఖ పరిసర మండలాల్లో భూముల ఆక్రమణలు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం సహా పలు అంశాలను పరిశీలించనుంది. రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ విజయ్ కుమార్ అధ్యక్షునిగా మరో రిటైర్డ్ ఐఏఎస్ వైవి అనూరాధ సభ్యురాలిగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి టి భాస్కర్ రావు సభ్యులుగా నియమించారు.
మూడు నెలల పాటు ఈ సిట్ సభ్యుల పదవీకాలం ఉంటుంది. విశాఖ భూ కుంభకోణాలకు సంబంధించి గత ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున భారీ స్థాయిలో దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి దస్తావేదులు మాయమయ్యాయి. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణ అపట్లో విశాఖ భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం తెరమీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పట్లో మంత్రులు కూడా ఒకళ్ల మీద ఒకళ్లు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి మనకు తెలిసిన విషయమే. మంత్రి గంటా అయితే స్వయంగా విచారణను ఎదురుకోవటానికి సిద్దంగా ఉన్నానని చెప్పి ఆయన వెల్లడించారు.
అలాగే ఈ విషయం మీద గంటాని టార్గేట్ చేసి అతని పై కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో అప్పట్లోనే సిట్ ఏర్పాటు చేసి కొంత మేరకు విచారణ జరిగినప్పటికీ అది ఇంకా కొలిక్కి రాని పరిస్థితి.