English | Telugu
సీనియర్ నటుడు విజయ్ చందర్ కి కీలక పదవి
Updated : Nov 11, 2019
ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా సీనియర్ సినీనటుడు విజయ్ చందర్ ను నియామిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి సంబంధించి మోహన్ బాబు, పోసాని, ఆలీ, జయసుధ, భాను చందర్ వంటి పేర్లు ప్రచారం జరిగినా.. చివరకు మాత్రం ఆ పదవి విజయ్ చందర్‌కి దక్కింది. మొదటి నుండి తనకు అండగా ఉన్న కారణంగానే సీఎం జగన్ ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.
కరుణామయుడుగా, సాయిబాబాగా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన విజయ్ చందర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తులు. తరువాత జగన్ కు కూడా అండగా ఉన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలోనూ, షర్మిళ పాదయాత్ర వేళ ,ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీకి మద్దతుగా పని చేసారు. జగన్ ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలా హాజరై.. జగన్ పట్ల తన విధేయత చాటుకున్నారు.