English | Telugu

హైదరాబాద్‌లో ఒక్క రోజే 3 వేల వాహనాలను సీజ్ చేశారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ కొంత మంది వాటిని ఖాతరు చేయకుండా ఇష్టారీతిన రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్‌లో సోమ‌వారం రోజు దాదాపు 3 వేల వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేసిన‌ట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

నగరంలోని అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని 25 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 75 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసినట్లు పోలీసులు తెలిపారు.

లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం మరింత సవివరంగా ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం-2005, అంటువ్యాధుల (నియంత్రణ) చట్టం-1897 కింద ఈ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లుగా ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రత్యేకంగా ప్రజలు, అధికారులందరికీ అర్థమయ్యేలా ఈ ఉత్తర్వు మాత్రం తెలుగులో విడుదల చేశారు.