English | Telugu
ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులు...
Updated : Oct 22, 2019
ఆర్టీసీ సమ్మె పద్ధెనిమిదివ రోజుకు చేరుకుంది.ఆర్టీసీ సమ్మెతో విద్యార్ధులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. నిన్నటి నుండి విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ఓ వైపు చెబుతోంది. కానీ గంటల తరబడి వేచి చూస్తున్నా బస్సులు మాత్రం రావడం లేదని ఫలితంగా సమయానికి కాలేజీలకు చేరుకోలేకపోతున్నామని విద్యార్ధులు అంటున్నారు. దీంతో ప్రజలతో పాటు విద్యార్థులు భారీ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఆ మేరకు ఆశించిన స్థాయిలో బస్సులు రావటం లేదు. పూర్తిగా వీళ్లంతా కూడా ప్రైవేటు వాహనాల పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితితులు ఉన్నాయి. ప్రయాణికులు ఎంతసేపు వేచిచూసినా కూడా గంటకు ఒక బస్సు మాత్రమే వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్, కాలేజీస్ కి పూర్తిగా ఇరవై రోజులు దాదాపుగా సెలవులు ప్రకటించింది. స్కూల్స్, కాలేజీలు నిన్నటి నుంచి రీఒపెనింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లాలంటే మాత్రం పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము విద్యార్థులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా అని ప్రభుత్వం ఓ వైపు చెప్తోంది. మరోవైపున తాత్కాలిక కండెక్టర్లు, తాత్కాలిక డ్రైవర్లతో ప్రమాదం జరుగుతున్నాయని చెప్పే ప్రయాణికులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్లంతా కాలేజీలకు స్కూల్స్ కు వెళ్లాలంటే పూర్తిగా ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది.ఇక ఈ సమ్మె పై కేసీఆర్ వీలైనంత త్వరగా స్పందింస్తే కానీ ప్రజలు ఇక్కట్ల నుంచి బయటపడరు.