English | Telugu

సింగరేణిలో గల్లంతైన కార్మికుడు! గోదావరిఖనిలో టెన్షన్!

మంగళవారం ఏప్రిల్ 7న‌ గనిలో మోటార్ రన్ చేయడానికి వెళ్లిన సంజీవ్ అనే కార్మికుడు ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో గోదావరిఖనిలో విషాధం అలుముకుంది. విషయం తెలుసుకున్న సంజీవ్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

అతడి కోసం అధికారులు అర్ధరాత్రి వరకు తీవ్రంగా గాలించారు. బుధవారం ఉదయం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. 11 ఇంక్లైన్ బొగ్గుగనిలోని నాలుగో సీమ్, ఒవటవ డిప్ వద్ద మోటార్ రన్ చేయడానికి సంజీవ్ వెళ్లినట్లు సింగరేణి సిబ్బంది తెలిపారు.

మంగళవారం రాత్రి జీఎంతో సహా అధికారులంతా కలిసి గనిలో వెతికారు. అయినప్పటికీ ఫలితం లేదు. సంజీవ్ గని లోపల సంప్‌లో పడినట్లు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది అతడి కోసం గాలింపు చేపట్టారు.