English | Telugu

వైరస్‌ పుట్టుక ల్యాబ్‌ లోనే! చైనా మూల్యం చెల్లించుకోక తప్పదా?

కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌ ల్యాబ్ లోనే ‌ పురుడు పోసుకుందని అమెరికా మరోసారి ఆరోపించింది. ఐతే ఈ సారి మాత్రం ఈ ఆరోపణలకు పక్కా సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ కావాలనే చైనా కరోనా వైరస్‌ను ల్యాబ్‌ నుంచే విడుదల చేసిందని వెల్ల‌డించారు. చైనా కుట్రను త్వరలోనే ప్రపంచం ముందు ఉంచుతామని ఆయన అన్నారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించటానికి చైనాయే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైరస్‌ కారణంగా జరిగిన నష్టాన్ని చైనా నుంచి వ‌సూలు చేస్తామ‌ని అమెరికా చెబుతోంది.

అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ పలుమార్లు కరోనా వైరస్‌ పుట్టుక వుహాన్‌ ల్యాబ్‌ లోనే జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత కరోనా వైరస్‌ వుహాన్‌ నుంచి బయటకు వచ్చిందని చెప్పారు. జపాన్‌కు చెందిన ఓ సైంటిస్టు కూడా ఇదే ఆరోపణ చేశారు. దీంతో అమెరికా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లవుతోంది. నిజంగానే అమెరికాకు ఏమైనా ఆధారాలు దొరికాయా?