English | Telugu
పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ
Updated : Dec 28, 2019
అసలే దొంగబుద్ది దానికి తోడు అమోఘమైన హస్తలాఘవం ఇక ఆగుతాడా అరవై నాలుగు విద్యలలో ఒకటైన చోరకళకి ప్రాణం పోసేలా.. సక్సెస్ ఫుల్ గా వందల చోరీలు చేసి పోలీసులకు సవాలు విసిరాడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఘరానా దొంగ. అతని పేరు దర్శి. మొదట్లో సింగిల్ గానే దొంగతనాలు చేసేవాడు, ఆ తరువాత గ్యాంగ్ ను తయారు చేసుకొని గ్యాంగ్ లీడర్ అయ్యాడు.2004 నుంచి 2009 వరకు ఏకంగా 400 చేశాడు. పూణేకు చెందిన యువతిని పెళ్లి చేసుకొని వ్యక్తిగత జీవితంలో కూడా స్థిరపడ్డాడు. కొట్టుకొచ్చిన సొమ్ముతో ఇల్లాలికీ ప్లాట్లు , నగలు భారీగానే కొనిచ్చేవాడు.
వీటి విలువ సుమారు కోటి రూపాయల వరకు వుంటుంది. భార్యకు నగలు నట్రా కొనిపెట్టంతో సరిపెట్టుకోకుండా పిల్లల్ని ఏకంగా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు.జాగ్రత్తగా దోచుకోవడం దోచుకున్న సొమ్మును అంతే జాగ్రత్తగా అమ్ముకోవడం ఇంటి పట్టునే ఉంటూ ఆ డబ్బు తో ఎంజాయ్ చేయటంతో పోలీసులకు చిక్కకుండా ఇంతకాలం తప్పించుకు తిరిగాడు.ఎంత జాగ్రత్త పడినా ఎదో ఒక రోజు తప్పు చెయ్యక తప్పదు.క్రికెట్ బెట్టింగ్ లో ఏకంగా 16 లక్షలు పోగొట్టుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేక ఈజీగా పోలీసులకు దొరికిపోయాడు.ఈ సారి కూడా సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశాడు.
అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ ను వదిలేసి పారిపోవలసి వచ్చింది. ఇప్పుడు మునుపటి రోజులు కావు కదా బైక్ కోసం మళ్లీ వచ్చి అక్కడే కాపు కాచుకొని ఉన్న పోలీసులకు దొరికిపోయాడు. అయితే ఈ సారి పోలీసులు పక్కా సాక్ష్యాలతో కేసు ఫైల్ చేశారు. జైలుకెళ్లడం తప్పదు అయితే చోర కళలో ఆరితేరి పోయాడు. దీనికి తోడు దీర్చి లైఫ్ కు అలవాటు అయిపోయాడు. పైగా జైల్లో చిప్పకూడు కూడా తినేశాడు అన్ని రకాలుగా ముదిరిపోయాడు. మరి భవిష్యత్తులో బయటకు వచ్చిన తర్వాత కష్ట పడి చేస్తాడా లేక మళ్లీ పాత రోజుల్ని రిపీట్ చేస్తాడా అనేది మాత్రం వేచి చూడాలి.