English | Telugu

చలిని జయించిన ఉల్లి :- ఉదయాన్నే ఉల్లి కోసం రైతుబజార్ల వద్ద బారులు తీరుతున్న జనం

కేజీ ఉల్లి కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. బయట మార్కెట్లో ఉల్లి కొనే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం ఉదయాన్నే కౌంటర్ల దగ్గరకు భారీగా తరలివెళ్తున్నారు. డిమాండ్ కు తగ్గ కౌంటర్లు లేకపోవటంతో కొన్ని చోట్ల తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా పార్వతీపురం రైతు బజార్ లో జరిగిన భారీ తోపులాటలు జరుగుతున్నాయి.ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా జనం ఉదయాన్నే బారులు తీరారు. కౌంటర్ ఒక్కటే కావడంతో వందల మంది జనం కౌంటర్ గేటు వెలుపల ఎదురు చూస్తున్నారు.

ఒక్క సారిగా గేటు తీయడంతో లైనులో నిలబడేందుకు జనం ఎగబడ్డారు.ఈ క్రమంలోనే ఒకరి పై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. చిన్నపిల్లల కూడా ఉండటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్నవారు కింద పడ్డ వారికి సహాయం అందించటంతో ప్రమాదం తప్పింది. సరిపడా కౌంటర్లు లేకపోవడం తోనే తొక్కిసలాట జరిగిందని అధికారులు కౌంటర్లు పెంచాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.