English | Telugu
ట్రంప్ తీరు బాగోలేదు! ఒబామా
Updated : May 10, 2020
కరోనాను ట్రంప్ ఎదుర్కొంటున్న తీరు గందరగోళంగా ఉందని ఒబామా చెప్పారు. స్వార్థం, విభజన, ఇతరుల పట్ల ద్వేషం వంటి పోకడలు ప్రస్తుతం అమెరికావాసుల జీవితాల్లో భాగమయ్యాయయని ఆయన అన్నారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదేతీరు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ పరిణామాల వల్లే తాజా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చాలా అసమర్థంగా స్పందిస్తున్నాయని చెప్పారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితులని ఎదుర్కోవడం ప్రభుత్వాలకు సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు. ఇటువంటి విపత్కర సమయంలో నాకేంటన్న ధోరణితో, అందరితోనూ గొడవ పెట్టుకుంటున్న పాలకులు ఉండడం ఈ విపత్తును మరింత గందరగోళంగా మార్చిందని ఒబామా అభిప్రాయపడ్డారు.