English | Telugu

నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలు 

ఏపీలో స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు లకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదలయింది. 13 జిల్లాల జిల్లా పరిషత్తు ప్రాదేశిక, మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో జిల్లాల వారిగా సోమవారం దాఖలు అయిన నామినేషన్ లు వివరాలు..

రాష్ట్రంలోని 652 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 68 నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 9947 మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 771 నామినేషన్లు దాఖలు చేశారు.

జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలు: శ్రీకాకుళం38 కి గాను 1, విజయనగరం 34 కి గాను 2,విశాఖపట్నం 39 కుగాను 3, తూర్పుగోదావరి 61 కు గాను 2, పశ్చిమగోదావరి 48 కి గాను 6, కృష్ణా 46 కుగాను 2, గుంటూరు 54 కుగాను 2, ప్రకాశం 55 కుగాను 6, ఎస్పీ ఎస్సార్ నెల్లూరు 46 కుగాను 7, కర్నూలు 53 కుగాను సున్నా, అనంతపురం 63 కుగాను 9, చిత్తూరు 65 కు గాను 22, వై ఎస్ ఆర్ కడప 50 కుగాను 6 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.

మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్ల వివరాలు: శ్రీకాకుళం 667 కు గాను 40, విజయనగరం 549 కుగాను 14, విశాఖపట్నం 651 కుగాను 38, తూర్పుగోదావరి 1086 కుగాను 93, పశ్చిమగోదావరి 863 కుగాను 71, కృష్ణా 723 కుగాను 50, గుంటూరు(805) కుగాను 32, ప్రకాశం లో 47, ఎస్పీ నెల్లూరు లో 39, కర్నూలు లో 37, అనంతపురం లో 78, చిత్తూరు లో 213,వై ఎస్ ఆర్ కడప జిల్లాలో 19 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.