English | Telugu

స్థానిక సంస్థల ఎన్నికల పరశీలకుల్లో ఐదుగురు ఐఎఎస్ అధికారుల మార్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల పరిశీలకులలో ఐదుగురు ఐ ఏ ఎస్ అధికారులను మార్చింది. ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ ఈ విషయం వెల్లడించారు.ఎన్నికల పరిశీలకులు గా 13 జిల్లాలకు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నియమించిన విషయం . వారితో పాటుగా మరో నలుగురు ఉన్నతాధికారులను రిజర్వు లో ఉంచింది. జిల్లాల వారిగా - టి.బాబు రావు నాయుడు - కర్నూలు, లతకార్ శ్రీకేష్ బాలజీరావు - కృష్ణ జిల్లా , హెచ్. అరుణ్ కుమార్ - తూర్పు గోదావరి జిల్లా, పి.ఎ. శోభా - విజయనగరం జిల్లా, కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా, సిదర్ధ్ జైన్ - చిత్తూరు జిల్లా, బి. రామారావు - శ్రీకాకుళం జిల్లా, వివేక్ యాదవ్ - ప్రకాశం జిల్లా , ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా, పి. బసంత్ కుమార్ - ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా , పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ కడప జిల్లా, కాంతిలాల్ దండే - గుంటూరు జిల్లా, హిమాన్షు శుక్లా - పశ్చిమ గోదావరి జిల్లా లకు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తారని రమేష్ కుమార్ వెల్లడించారు.