English | Telugu

ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా సభ :- టీఆర్ఎస్ పార్టీ మజిలిస్ కు మద్దుతు ఇవ్వనుందా ?


ఎన్పీఆర్ ను అమలు చేయబోమన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరనుందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఐఐ తరవాత దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఆ తర్వాత ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను తీసుకువచ్చేందుకు సీఐఐ అన్న వాదనలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ సీఎంలు,ఎన్పీఆర్ తమ రాష్ట్రంలో అమలు చేయమని ప్రకటించారు. ఎన్పీఆర్ ను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు తెలంగాణ లోనూ ఎంఐఎం పార్టీ ఎన్పీఆర్ ను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు చేపడుతోంది.

సీఎం కేసీఆర్ ను కలిసిన ఓవైసీ సీఐఐ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ లను అమలు చేయొద్దని కోరారు. ఇవాళ నిజామాబాద్ లో వీటికి వ్యతిరేకంగా ఎంఐఎం బహిరంగ సభను నిర్వహించింది. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్లమెంటులో ఓటు వేసింది అన్నారు కేసీఆర్. సీఐఐ విషయంలో ఇంతకన్నా చెప్పాల్సిన విషయం లేదన్నారు కేటీఆర్. ఎన్పీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది అని కేటీఆర్ వల్లడించారు. ఎన్పీఆర్ సమయం వచ్చినప్పుడు పార్టీలో ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు పార్లమెంటరీ పార్టీ నేత కేకే.ఎన్పీఆర్ పై పూర్తి వివరాలు అందిన తర్వాతే టీఆర్ ఎస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కాని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని టీఆర్ ఎస్ విమర్శల ఆరోపణలు చేస్తొంది.