English | Telugu

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వస్తుండగా రేవంత్‌ని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారన్న అభియోగంపై.. ఇప్పటికే నలుగురు రేవంత్‌ అనుచరులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తాజాగా రేవంత్ ని అరెస్ట్ చేశారు. ఆయన్ని నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​ కు తరలించారు. కాగా, ఈ వ్యవహారంలో రేవంత్ సహా మొత్తం 8 మందిపై నార్సింగ్‌ పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి.