English | Telugu

కేంద్రం విడుద‌ల చేసిన లాక్‌డౌన్ మార్గదర్శకాలు!

1. అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సర్వీసులు మే 3 వరకు ర‌ద్దు.

2. భద్రత విధులకు తప్ప బస్సు, రైలు మెట్రో సర్వీసులు ర‌ద్దు.

3. అత్యవసర వైద్యానికి మినహా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలపై నిషేధం. ఎవరూ సరిహద్దులు దాటడానికి వీల్లేదు.

4. ట్యాక్సీ సర్వీసులకు కూడా అనుమతి లేదు.

5. నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దు.

6. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు బంద్‌.

7. సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం.

8. మత ప్రదేశాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలకు అనుమ‌తి లేదు.

9. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా.

10. హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు గుర్తించాలి. ఈ ప్రదేశాలలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదు.

11. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి అనుమ‌తి.

12. ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలకు అనుమ‌తి.

13. ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి అనుమతి.

14. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలకు అనుమతి. వ్యవసాయ, ఉద్యానవన విభాగాలకు అనుమతి.

15. వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలకు అనుమతి.

16. ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు, బ్యాంకు కార్యకలాపాలకు అనుమతి.

17. వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవు.

18. ఉపాధి హామీ పనులు, భవన నిర్మాణ పనులకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరించరాదని, సమీపంలో ఉన్నవారితోనే పనులు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణ పనులకు అనుమతి. ఉపాధి కూలీలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి.

19. ఎరువులు, పరుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు తెరిచేందుకు అనుమతి. పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు.