English | Telugu

రాష్ట్రానికి పట్టిన డేంజరస్‌ వైరస్‌ వైసీపీః కొల్లు రవీంద్ర 

విజయవాడ సెంటర్‌లో జబ్బలు చరుచుకొని చాలెంజ్‌లు విసురుకునే సమయం కాదు. పింఛను, రేషను కావాలంటే ‘మా పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం కావాలి’ అంటూ సంతకాలు చేయండంటూ వలంటీర్లు బలవంతంగా సేకరిస్తున్నారంటే ప్రభుత్వ పైశాచికత్వం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

‘‘రాజ్‌భవన్‌లో కరోనా పాజిటివ్‌ రావడం రాష్ట్రానికే సిగ్గుచేటు.. ఇలాంటి పరిపాలన దేశంలో ఎక్కడా చూడలేదు. ‘‘విపత్తుల్లోనూ రాజకీయాలే వైసీపీ అజెండా. కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణం. రాష్ట్రానికి పట్టిన డేంజరస్‌ వైరస్‌ వైసీపీ. ప్రచారం కోసం వైసీపీ నేతలే వైర్‌సని వ్యాప్తి చేశారు’’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.