English | Telugu
హైదరాబాద్‌లో ప్లాస్మా దానానికి 32 మంది రెడీ! ఓవైసీ
Updated : Apr 28, 2020
ఈ వ్యవహారంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కలుగజేసుకున్నారు. తానే దగ్గరుండి కరోనా నుంచి కోలుకున్న వారితో మాట్లాడి ప్లాస్మా దానానికి ఒప్పించారు. దాదాపు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ అయ్యారని.. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. వారి పేర్లను కూడా జత చేస్తూ లేఖను పంపించారు ఎంపీ అసదుద్దీన్.
అంతే కాదు కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీకి చెందిన 200 మంది తబ్లీగీలు ప్లాస్మా దానానికి ముందుకు వచ్చారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తీవ్ర అస్వస్థులుగా ఉన్న రోగులకు ఆ ప్లాస్మాతో చికిత్స జరుపుతారు. ఇఫ్తార్ ముగిశాక తబ్లీగీలు తమ ప్లాస్మాను దానం చేశారని, ఈ సేకరణకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ మహమ్మద్ షోయిబ్ వెల్లడించారు.