English | Telugu

కేరళ సి. ఎం . ను చూసి నేర్చుకోమని జగన్ కు కేశినేని నాని సలహా !

కేశినేని నాని... ఫైర్ బ్రాండ్ టీ డీ పీ ఎం.పి . జనాలకు అసలు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని నాయకుడు. ఏ ఒక్క చిన్న వకాశం వచ్చినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని దులిపి ఆరేయటానికి అసలేమాత్రం వెనుకాడడు. వైరస్‌ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేరళ సీఎం పినరయి విజయన్‌‌ను చూసి నేర్చుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి , ఆయన ట్విటర్ ద్వారా సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా బాధితులు సంఖ్య ఐదుకు పెరిగింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఏపీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది. ఏపీలో బస్సులు బంద్ చేసింది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి ఇంటింటికి తిరిగి, విదేశాల నుంచి వచ్చిన వారు, తాజాగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడే వారి వివరాలను సేకరిస్తోంది. అయితే, కరోనా నియంత్రణకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తామనే అంశాన్ని ప్రకటించలేదు.
కేరళ ప్రభుత్వం మాత్రం కరోనా నియంత్రణకు రూ.20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. గతంలో నిఫా వైరస్‌ మీద పోరాడిన అనుభవం ఉన్న కేరళ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. అందులో రూ.500 కోట్లను హెల్త్ కిట్స్ (శానిటైజర్లు, మాస్క్‌లు) వంటి వాటి కోసం వినియోగించనున్నారు. అలాగే, రూ.2000 కోట్లను చిన్న చిన్న రుణాలు , నెలవారీ సరుకులు, రేషన్ వంటి వాటి పంపిణీ కోసం వినియోగించనున్నారు.ఇంతకీ మన ఎం. పి . గారి సూచనను పాటిస్తారో, లేదో చూడాలి మరి. !