English | Telugu

దేశ ప్రజలకు రైల్వే శాఖ ప్రత్యేక విజ్ఞప్తి...

దేశవ్యాప్తంగా మే 3 వరకూ... ప్రయాణికుల రైళ్లేవీ నడపట్లేదనీ... ప్రత్యేక రైళ్లేవీ నడపట్లేదనీ భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక ప్రకటన జారీచేసింది. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరింది. ఏ ప్రకటనైనా అధికారికంగా వచ్చేది మాత్రమే నమ్మాలని ప్రజలను కోరింది. ఈ విషయంపై ప్రజలందరికీ అవగాహన కలిగించాలని మీడియా సంస్థలను రైల్వే శాఖ కోరింది. మే 3 వరకూ... ప్రజలెవ్వరూ... రైల్వే స్టేషన్ల దగ్గరకు రావొద్దని కోరింది.

ఇండియాలో కరోనా వచ్చిన కొత్తలో... దాదాపు 12 మంది పాజిటివ్ వచ్చిన వారు రైళ్లలో ప్రయాణించారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా రైల్వే శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం రైల్వే శాఖ 15,523 రైళ్లను నడుపుతోంది. వీటిలో 9000 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 3000 మెయిల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులున్నాయి. ఇవేవీ ఇప్పుడు నడవట్లేదు.