English | Telugu

ప్లాస్టిక్ ని తుడిచి పెట్టాలాన్న లక్షంతో ఉన్న జిల్లా కలెక్టర్.....

శ్రీ దేవసేన అధికారులతో కలిసి రంగంపల్లి నుంచి శాంతి నగర్ వరకు రాజీవ్ రహదారి పై ఇరువైపులా ప్లాస్టిక్ ని ఏరివేశారు.స్వచ్ఛ శుక్రవారంలో భాగంగా స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆస్తమా వ్యాధికి ముఖ్య కారణం ప్లాస్టిక్ వస్తువులేనని పర్యావరణానిని కూడా పాడు చేస్తుంది అని వెల్లడించారు . ప్రతి ఒక్కరూ తమ చుట్టు పక్కల ఉన్న ప్లాస్టిక్ ను ఏరివేసే కార్యక్రమం చేయాలన్నారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు తనిఖీలు చేసి ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

వ్యాపారస్తులకూ ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడినట్లు తేలిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ రోజు ఆస్తమా పెరిగిపోవడానికి సగం కాలుష్యానికి కారణమైతే ఇంకో సగం ఈ ప్లాస్టికే కారణమని కాబట్టి అందరం కలిసి దీన్ని పాటిస్తే మాత్రం మనకి ఇంత పెద్ద పెనుభూతాన్ని పారదోలే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి అందరు కూడా ఎవరి పరిసరాల్లో వాళ్లు ప్లాస్టిక్ ను సేకరించి దాన్ని సురక్షితంగా డిస్పోజల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఏ పనైనా మంచిపని ప్రజలకు ఉపయోగపడే పని, శానిటేషన్ వర్కర్ లు చేయాల్సిన పని అధికారులెందుకు చేయాలనే ప్రశ్న ఇక్కడ రాకూడదని ఎందుకంటే అందరం కలిసి చేస్తేనే ఎవరికి వాళ్ళకి వాళ్ళ బాధ్యత తెలిసి ఎక్కడా ప్లాస్టిక్ అనేది ఈ రకంగా పారేయకుండా ఉంటారు అని ఆయన వెల్లడించారు.టూత్ బ్రష్ నుంచి తల దువ్వుకునే దువ్వెన దగ్గర నుంచి సిమెంట్ కు వాడే బస్తాల దగ్గర్నుంచీ ఇవన్నీ నిజానికసలు భూమిలో పాతుకుపోయిన పరిస్థితి ఏర్పడిందని ఎవరి పరిసరాల్లో వాళ్లని ప్లాస్టిక్ ను నిషేధించి దాని సేకరించి జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని పూర్తిగా అన్ని నాలుగు మున్సిపాలిటీల్ లో అందరు అధికారులు కూడా చేయటం జరుగుతుంది.ఇలాంటి స్వచ్ కార్యక్రమాలను మరికొన్ని చేపడితే కానీ మనం రోగాలను అరికట్టలేమని వెల్లడించారు.