English | Telugu
హుజూర్ నగర్ బైపోల్ రిజల్ట్... 14 టేబుళ్లపై కొనసాగుతోన్న కౌంటింగ్
Updated : Oct 24, 2019
తెలంగాణతోపాటు ఏపీలోనూ తీవ్ర ఉత్కంఠ రేపిన హుజూర్నగర్ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందో మరికాసేపట్లో తేలిపోనుంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ గోడౌన్లో హుజూర్నగర్ బైపోల్ కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తి ఫలితం రావొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా తలపడిన హుజూర్నగర్ బైపోల్ లో మొత్తం 28మంది అభ్యర్ధులు పోటీపడ్డారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉండటంతో, కౌంటింగ్‌పై కాంగ్రెస్‌లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మబోమంటోన్న ఉత్తమ్ దంపతులు... విజయం కాంగ్రెస్‌దేనన్న నమ్మకంతో ఉన్నారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇక, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటోన్న బీజేపీ అసలు డిపాజిట్టే రాదని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి.