English | Telugu
డాక్టర్ సుధాకర్ కేసు సంచలన మలుపు.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు
Updated : May 22, 2020
డాక్టర్ సుధాకర్ ఘటనపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. సుధాకర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. కానీ, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఆ గాయాల ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ నివేదికపై అనుమానాలు ఉన్నాయని, అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు కోర్టు తెలిపింది.