English | Telugu

పాతబస్తీలో అక్రమంగా ఇ-సిగరెట్లను విక్రయిస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు...

దేశ వ్యాప్తంగా ఇ-సిగరెట్ లను కేంద్రం నిషేధించింది. స్కూలుకు వెళ్ళే పిల్లలు నుంచి కాలేజికి వెళ్లే యువకుల వరకూ అందరూ ఇ-సిగరెట్లను వాడటంతో కేంద్రం దీనిపై నిషేదాన్ని విధించింది. ఎవరైనా అమ్మితే చట్ట పరంగా చర్యలు తీసుకునే ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. వ్యాపారస్తులు ఇ-సిగరెట్ లను వెంటనే పోలీసులకు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు, ఆయన హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా ఇ-సిగరెట్ లను అమ్ముతున్న వారిని పాతబస్తీలో దాడులు నిర్వహించి, టాస్క్ ఫోర్స్ తో పెద్ద మొత్తంలో సిగరెట్ లను సీజ్ చేశారు.

మామూలు సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదముందో ఇ-సిగరెట్లు తాగితే కూడా అంతే ప్రమాదముందని, ఇ-సిగరెట్లలో టొబాకో,నికోటిన్,కార్బన్ ఇవేవీ లేకపోయినా దాని నుంచి వచ్చే పొగ అత్యంత ప్రమాదకరమైందని అధికారులు చెబుతున్నారు. ఇ-సిగరెట్లు అత్యధికంగా విదేశాల నుంచే దిగుమతి అవుతుందని అధికారులు వెళ్లడించారు. ఇ-సిగరెట్ ఒక్కోదాని విలువ వెయ్యి నుంచి మూడు వేల లోపు ఉంటుందని చెబుతున్నారు. అది ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కావడం వల్ల అది సిగరెట్ అని ఎవరూ గుర్తించరు దీంతో కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి అనుమానం కూడా రాదు. దాని పరిమాణం చిన్నగా ఉండటం వల్ల పిల్లలు సులభంగా తీసుకెళ్ళగలుగుతున్నారు. ఇది విస్తరిస్తే దేశం మొత్తాన్ని నాశనం చేస్తుందనే ఆలోచనతో కేంద్రం దీనిపై నిషేదాన్ని విధించింది. అక్రమంగా ఎవరైనా దీనిని విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకు రావాలని ఒక ఆర్డినెన్సును కూడా ప్రవేశ పెట్టింది.