English | Telugu

కరోనా కట్టడి కంటే దోపిడీ గురించే సీఎం ఆలోచనంతా: బుచ్చయ్య చౌదరి

ముఖ్యమంత్రి కరోనా కట్టడి కంటే దోపిడీ ఎలా చేయవచ్చుననే ఆలోచన ఎక్కువగా చేస్తున్నారన్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పేదల ఇళ్ల కోసం సేకరించే భూముల కొనుగోళ్లలో కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కుంభకోణం జరుగుతోందని గోరంట్ల విమర్శించారు.

కాకినాడలో మడ అడవులు, కోరుకొండలో బురద కాలువలకు సంబంధించి ముంపునకు గురయ్యే భూములను సేకరిస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పేదల ఇళ్ల స్థలాల పేరుతో 250 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని విమర్శించారు. ట్రిబ్యునల్‌కు వ్యతిరేకంగా మడ అడవులు, భూములను నరికివేశారన్నారు.

భూ సేకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని, పంపకాలు తెగక రోడ్డు ఎక్కుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రజోపయోగకరమైన భూముల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు.